Janasena News Paper
తాజా వార్తలుపల్నాడు

సమావేశమైన వడ్డెర కుల నాయకులు…                            వడ్డే ఓబన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి…

సత్తెనపల్లి పట్టణంలోని వడ్డెర సంఘం కార్యాలయ ఆవరణలో వడ్డెర షార్ప్ థింకింగ్ అసోసియేషన్ సత్తెనపల్లి నియోజకవర్గ అధ్యక్షులు, మాజీ జడ్పీటీసీ బత్తుల వెంకటస్వామి  అధ్యక్షతన నియోజకవర్గ వడ్డెర సంఘ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న వడ్డె ఓబన్న విగ్రహ కమిటీ ఛైర్మన్ కొమెర అనంతరామయ్య  మాట్లాడుతూ… మార్చి 16 వ తేదీ ఆదివారం మాచర్ల పట్టణంలో వడ్డే ఓబన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరుగనున్నందున ఈ కార్యక్రమానికి సత్తెనపల్లి ప్రాంత వడ్డెర కులస్తులంతా భారీగా తరలివచ్చి ఆ మహోన్నతమైన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అన్నారు.
నియోజకవర్గ ముఖ్య నాయకులు పాల్గొని ప్రసంగించిన ఈ కార్యక్రమంలో… పల్నాడు జిల్లా వడ్డెర వెల్ఫేర్ బోర్డు మాజీ సభ్యులు కొమెర వీరాంజనేయులు, కొమర దుర్గారావు,చల్లా పిచ్చయ్య మాస్టారు, తురకా వీరాస్వామి, పల్లపు ధర్మారావు, ఒంటిపులి నాగేశ్వరరావు,దేవళ్ళ రాంబాబు,బత్తుల శ్రీను, కుంచపు శ్రీను,తమ్మిశెట్టి ఏడుకొండలు,కుంచపు గంగరాజు,తన్నీరు నరసింహారావు,చల్లా అంజి, గుంజి విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు….

Related posts

Leave a Comment