Janasena News Paper
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

భట్లూరు గ్రామంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై పోరు బాట తో  స్వర్ణాంధ్ర స్వచ్ఛఆంధ్ర కార్యక్రమం… నిర్వహించిన ఎంపీడీఓ, సర్పంచ్…

ఈ రోజు అనగా 15.03.2025 న సత్తెనపల్లి మండలం పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీల నందు ప్రభుత్వ ఉత్తర్వులు జీవో ఆర్టీ నెంబర్ 24 ను అనుసరించి గ్రామపంచాయతీలు ఎందుకు స్వచ్ఛ్ ఆంధ్ర స్వర్ణాంధ్ర లో భాగంగా అన్ని గ్రామపంచాయతీలు ఎందుకలా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ షెడ్లు పరిసరాల పరిశుభ్రత పై,సింగిల్ యూస్డ్ ప్లాస్టిక్ వస్తువులను నిషేధిస్తూ అన్ని గ్రామ పంచాయతీలలో గ్రామసభలు నిర్వహించి తీర్మానం చేసి ఉన్నారు.భట్లూరు సర్పంచ్ కే రామారావు అధ్యక్షతన గ్రామ సభ సదరు విషయాలపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించడం జరిగినది.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు,వార్డు మెంబర్లు, ఇతర గ్రామ స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది, గ్రామపంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.బట్లూరు గ్రామపంచాయతీ నందు జరిగిన కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి బి శ్రీనివాస్ రెడ్డి, ప్రత్యేక పరిశీలకులు  పి.శ్రీనివాసరావు జిల్లా ప్రజా పరిషత్ గుంటూరు  పాల్గొన్నారు.మండల విస్తరణ అధికారి ఏ శ్రీనివాస్ రెడ్డి పలు గ్రామాలలో గ్రామసభలలో పాల్గొన్నారు. భావన ఏఈ ఆర్డబ్ల్యూఎస్  కూడా గ్రామ సభలలో పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించి,ర్యాలీ నిర్వహించారు…

సభను ఉద్దేశించి మాట్లాడుతున్న సర్పంచ్

ర్యాలీ లో పాల్గొన్న ఎంపీడీఓ,సర్పంచ్,ఇతర అధికారులు…

Related posts

Leave a Comment