సత్తెనపల్లి,మార్చి16,జనసేన ప్రతినిధి….



డొక్కా సీతమ్మ అన్నప్రసాద వితరణ పథకం 22 వ సారి దాతల సహకారంతో 120 మందికి భోజనం అందించటం అభినందనీయం..అప్పపురపు నరేంద్ర డొక్కా సీతమ్మ అన్న ప్రసాద వితరణ వ్యవస్థాపకులు,ఆదివారం ది 16.03.25 తేదీ మధ్యాహ్నం 12 గంటలకు సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలలో డొక్కా సీతమ్మ అన్నప్రసాద వితరణ పథకం 22 వ సారి దాతలు సత్తెనపల్లి పట్టణానికి చెందిన వెలుగురి వెంకటేశ్వర్లు ధర్మపత్ని అండాలు పుణ్యతిది సందర్బంగా తన కుమారుడు వెలుగురి శరత్ బాబు ఆర్ధిక సహాయంతో 120 మంది నిరుపేద రోగులకు, వారి సహాయకులకు ఉచిత బోజనము అందించారు.ఈనాటి కార్యక్రమంలో సేవలు అందించిన వారు ప్రభుత్వ వైద్యశాలలో డా.సుజాత,డా. తేజ,పులిపాటి శ్రీరామమూర్తి, కట్టమూరి అప్పారావు,దివ్వెల శ్రీనివాసరావు,బొక్కా సంగీతరావు,గంజి వీరాస్వామి, సూరే రామ కోటేశ్వరరావు, కుంచనపల్లి శ్రీనివాసరావు,పరిమి విశ్వేశ్వరరావు,కట్టా శంకరరావు,కాగితాల గోపాలకృష్ణ,అప్పాపురపు సూర్య కుమారి తదితరులు పాల్గొన్నారు…