Janasena News Paper
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం లో పాల్గొన్న సత్తెనపల్లి నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు..

సత్తెనపల్లి పట్టణం రఘురామ్ నగర్ ప్రజావేదిక నందు తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జెండా ఎగరవేసిన రాష్ట్ర జిల్లా పట్టణ మండల నాయకులు.ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ అభిమానులకు కార్యకర్తలకు నేతలకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం పుట్టింది తెలుగుదేశం. అణగారిన వర్గాలకు అండగా నిలిచింది పసుపు జెండా. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్న ఎన్టీఆర్ ఆశయ సాధన తెలుగు రాష్ట్రాల అభివృద్ధి ప్రజా సంక్షేమానికి శ్రమిస్తున్న తెలుగుదేశం పార్టీ అని తెలియజేశారు..ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర జిల్లా నియోజకవర్గ పట్టణ మండల దళిత మైనారిటీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..

Related posts

Leave a Comment