డొక్కా సీతమ్మ అన్నప్రసాద వితరణ పథకం 26 వ సారి పల్నాడు జిల్లా, సత్తెనపల్లి పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో దాత అయిన స్వచ్ఛంద పదవి విరమణ చేసిన పెద్దలు ఎలక్ట్రికల్ ఏ.డి. ఇ బత్తుల శ్రీనివాసరావు గారి ఆర్ధిక సహాయంతో (వీరు రెండవ సారి) 120 మంది నిరుపేద రోగులకు మరియు వారి సహయకులకు జనసేన పార్టీ నాయకులు అప్పాపురపు నరేంద్ర ఆద్వర్యంలో జరుగుతున్న డొక్కా సీతమ్మ అన్నప్రసాద వితరణ పథకంలో ఉగాది పండుగ సందర్భంగా ఉచితంగా భోజనం అందించటం జరిగింది.పండుగ అనేది ఒక కుటుంబ సభ్యులకే పరిమితం కాకుండా నిరుపేదల ఆకలి తీర్చుతున్న బత్తుల శ్రీనివాసరావు గార్కి మరియు వీరి కుమారుడు న్యాయ శాస్త్ర విద్యార్థి బత్తుల దినేష్ కృష్ణకు వీరి కుటుంబ సభ్యులకు పెద్దలు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.ఈనాటి కార్యక్రమంలో నర్సింగ్ సిబ్బంది,పెద్దలు పులిపాటి శ్రీరామమూర్తి,సూరే రామకోటేశ్వరరావు,దివ్వెల శ్రీనివాసరావు,గంజి వీరాస్వామి,చేపూరి నాగేశ్వరరావు, కట్టమూరి అప్పారావు,కుంచనపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు…..
