Janasena News Paper
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

ఘనంగా సత్యనారాయణ స్వామి కళ్యాణం మహోత్సవం.

మహా అన్నదాన కార్యక్రమం లో పాల్గొన్న గుంజ..

బెల్లంకొండ మండలం లోని చండ్రాజుపాలెం గ్రామంలో సత్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్బంగా ఆలయ ధర్మకర్త ముళ్ళ బిక్ష్యం మాట్లాడుతూ సత్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించటం జరిగింది  ప్రతి సంవత్సరం నిర్వహించే సత్యనారాయణ స్వామి వ్రతం కార్యక్రమం నిర్వహించి, పీటల మీద కూర్చున్న భక్తులకు అర్చకులు స్వామివారి వ్రత పూజ చేయించి స్వామి వారి చరిత్ర తెలియజేశారు…..

  అనంతరం భక్తులకు  అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం కు ముఖ్యఅతిథిగా బెల్లంకొండ మండల బీసీ సెల్ అధ్యక్షుడు గుంజ గంగా రావు పాల్గొని అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు.

అదేవిధంగా అన్నదానానికి 15 బాకిట్ల పెరుగు అందజేశారు ఆయన మాట్లాడుతూ ఈ రోజు స్వామి వారి సేవలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న కమిటీ వారికి ప్రత్యేక అభినందనలు  తెలిపారు.

భక్తులు అధికంగా పాల్గొని స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అన్నదాన కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త ముళ్ళ బీక్షం మండల బీసీ సెల్ అధ్యక్షుడు గుంజ గంగా రావు తమ్మిసెట్టి వెంకటగిరి ఏసుపాదం జనసేన వైస్ ప్రెసిడెంట్ మణికంఠ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

Leave a Comment