నాగిరెడ్డి పాలెం గ్రామంలో మురికి కాలువల పూడికతీత!
మండల కోర్ కమిటీ సభ్యులు వెన్నా సీతారామిరెడ్డి.
గ్రామాల్లోని అభివృద్ధి పారిశుద్ధ్య, రైతుల సమస్యలు, సత్వరమే పరిష్కార మార్గం చేసే విధంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని మండల కోర్ కమిటీ సభ్యులు వెన్న సీతారామిరెడ్డి అన్నారు.
పెదకూరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ ఆదేశాల మేరకు గ్రామాల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మండలంలోని నాగిరెడ్డి పాలెం గ్రామంలో శనివారం పారిశుద్ధ్య కార్మికులతో మురికి కాలువలు పూడికతీత, కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలు ఇంటి పరిసర ప్రాంతాల్లో మురికి కలవలో నీరు పేరుకుపోయి ఉండటం వలన, ప్రజలు రోగాలను బారిన పడుతారని, ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని, అదేవిధంగా గ్రామంలో అన్ని వీధుల్లో మురికి కాలువ పూడిక తొలగించి, బ్లీచింగ్ చల్లటం, పలు రకాలైన సస్య రక్షణలో చేపట్టడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు బద్దూరి వీరారెడ్డి, బద్దూరి వెంకటకృష్ణారెడ్డి ( బుల్లోడు), చావలి రామకృష్ణ, గ్రామ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
