సత్తెనపల్లి రూరల్ మండలం గుడిపూడి గ్రామంలో 40 లక్షల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన సచివాలయం భవనం, 21.80 లక్షల రూపాయల తో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రం హెల్త్ వెల్నెస్ సెంటర్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ, సహకార,మార్కెటింగ్ పశుసంవర్ధక పాడి పరిశ్రమ అభివృద్ధి,మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు,నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు.
సత్తెనపల్లి పట్టణం లో స్వర్గీయ నందమూరి తారక రామారావు,కోడెల శివప్రసాదరావు గార్ల విగ్రహ ఆవిష్కరణలు చేసినఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ, సహకార,మార్కెటింగ్ పశుసంవర్ధక పాడి పరిశ్రమ అభివృద్ధి మరియు మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు,నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు,శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కోడెల శివరాం…
సత్తెనపల్లి పట్టణ మార్కెట్ యార్డ్ నందు నూతన పాలకవర్గ అభినందన సభలోఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ, సహకార,మార్కెటింగ్ పశుసంవర్ధక పాడి పరిశ్రమ అభివృద్ధి, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు,నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు కృష్ణదేవరాయలు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ, జనసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు పాల్గొన్నారు…
గ్రామంలో,పట్టణం లో అంగరంగ వైభవంగా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కి స్వాగతం పలికిన కూటమి శ్రేణులు…
ఈ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జన్మదిన సందర్బంగా కేక్ కట్ చేశారు…
రైతులకు సబ్సిడీ పొందిన తైవాన్ స్ప్రేయర్లు, వ్యవసాయ పనిముట్లు పంపిణీ చేశారు…ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో వున్నా రాష్ట్ర జిల్లా నియోజకవర్గ పట్టణ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు…..






