బెల్లంకొండ,జూలై 08, జనసేన ప్రతినిధి

మండలం లోని బెల్లంకొండ గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమంలో బెల్లంకొండ మండలవ్యవసాయ అధికారి అరుణకుమారి పాల్గోని మాట్లాడుతూ ప్రస్తుతం ప్రత్తి,మిరప,వరి పంటలు సాగు చేసే రైతులు తప్పనిసరిగా పచ్చిరొట్టె పైరుల ప్రాముఖ్యత గురించి తెలియజేశారు. కౌలు రైతులు గ్రామంలోని రైతు సేవా కేంద్రంల ద్వారా భూ యజమానులు అంగీకారంతో పంట సాగు హక్కు పత్రాలు పొందాలని సూచించారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా అర్హత కలిగిన రైతుల యొక్క వివరాలు ప్రభుత్వం ఈ కె వై సి ఆటో అప్డేట్ చేయటం జరిగిందన్నారు. ముఖ్యంగా రైతులు విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు లైసెన్సు వున్న డీలర్ల వద్దనే కొనుగోలు చేసి తగిన విధంగా బిల్లు పొంది, పంట కాలం పూర్తి అయ్యే వరకు భద్ర పరుచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ సిబ్బంది రైతులు పాల్గొన్నారు.