Janasena News Paper
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమిష్టి కృషితోనే విద్యార్థులు అభివృద్ధి పథంలోకి వస్తారు –

జిల్లా ఎస్పీ శ్రీ కంచి.శ్రీనివాస రావు ఐపిఎస్.,*

విద్యార్థులలో వికాసం మరియు మంచి భవిష్యత్తు దిశగా వారిని సక్రమ మార్గంలో నడిపించడంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల పాత్ర కీలకంగా ఉంటుందని జిల్లా ఎస్పీ  కంచి.శ్రీనివాస రావు, ఐపిఎస్., తెలిపారు.

▪️ఈరోజు లింగంగుంట్ల లోని శంకరభారతి ఉన్నత పాఠశాల నందు నిర్వహించిన మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీట్ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

▪️ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన ఎస్పీ కి విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పుష్పగుచ్చాలు అందజేసి సాదర స్వాగతం పలికారు.

*ఎస్పీ మాట్లాడుతూ..*

▪️నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థుల విజయానికి మెరుగైన నైపుణ్యాలు ఎంతో అవసరం.

▪️మారుతున్న కాలానికి అనుగుణంగా చురుకుతనం, సున్నితత్వం, బాధ్యతాయుగంగా ఆలోచించే ధోరణి పెంపొందించుకోవాలని తెలిపారు.

▪️మార్కుల వెంట పరిగెడుతూ విద్యార్థులలో మానసిక ఒత్తిడి పెరుగుతుంది. దీనినీ తగ్గించేందుకు తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు కలిసికట్టుగా ముందడుగు వేయాలి.

▪️మాదకద్రవ్యాల వ్యసనాలు,సోషల్ మీడియా వ్యసనం నుండి వారిని దూరంగా ఉండడానికి బాధ్యతాయుతంగా తల్లిదండ్రులు వ్యవహరించాలి అని తెలిపారు.

▪️విద్యార్థుల యొక్క కదలికలపై తల్లిదండ్రులు నిరంతరం ఓ కంట కనిపెడుతూ వారు చేసే పనులపై దృష్టి కేంద్రీకరించాలి అని తెలిపారు.

▪️మీకు ఏ సమస్య ఉన్న మీ తల్లిదండ్రులతోనూ ఉపాధ్యాయులతో ధైర్యంగా తెలుపుకొని ఆ సమస్య నుంచి ఉపశమనం పొందాలి గాని దానినే తలుచుకుంటూ నిరుత్సాహపడకూడదు అని తెలిపారు.

▪️ఏదైనా సమస్య వస్తే దానిని ఎదురుగా నిలబడి పోరాడాలని, తల్లిదండ్రుల పేరు ప్రఖ్యాతలు పెంచే దిశగా అడుగులు వేయాలని తెలిపారు.

▪️విద్యార్థులు చదువుతోపాటు క్రీడా నైపుణ్యాలు పెంచుకొని శారీరక మరియు మానసిక, శారీరక దృఢత్వాన్ని అలవర్చుకోవాలని, ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు అవిశ్రాంతంగా కృషి చేయాలన్నారు.

▪️విద్యార్థులకు గుడ్ అండ్ బ్యాడ్ టచ్, మాదక ద్రవ్యాల వలన కలిగే దుష్పరిణామాలు, సైబర్ నేరాలు, ఇతర రకాలైన నేరాల గురించి ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలని తెలిపారు.

▪️విద్యార్థులలో దాగివున్న ప్రతిభను గుర్తించి ఉన్నత లక్ష్యాలు సాధించేలా  కృషి చేయాలి అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎస్పీ తో పాటు,అదనపు ఎస్పీ సంతోష్ , నరసరావుపేట ఆర్డీవో,శంకర భారతి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మరియు పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Related posts

Leave a Comment