ఉన్నత అధికారులు స్పందించాలని కోరుకుంటున్న ప్రజలు….
సత్తెనపల్లి రూరల్, జులై 23,జనసేన ప్రతినిధి…
నిన్న మధ్యాహ్నం 3 గంటల నుండి నిరంతరాయంగా 24గంటలు ఆరు గ్రామాలకి నిలిపివేయబడింది.సరైన విద్యుత్ లైన్లు లేకపోవటం దీనికి కారణం. ఇదే విషయాన్ని గతంలో స్థానిక ఫణిదం సచివాలయం ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు విద్యుత్తు శాఖ మంత్రి అయిన గొట్టిపాటి రవికుమార్ కి విన్నవించడం జరిగింది. దీని పై ఆయన స్పందించి అధికారులను కొత్త లైన్లను ఏర్పాటు చెయ్యమని ఆదేశించారు. అయినప్పటికీ దీని పై స్పందించక పోవటం గమనార్హం.ఇప్పటికి అయిన అధికారులు స్పందించి తగిన చర్యలు చేప్పట్టవలసిందిగా గ్రామ ప్రజలు కోరుచున్నారు…