బెల్లంకొండ ఆగస్టు 16 జనసేన ప్రతినిధి

సూపర్ సిక్స్ లో స్త్రీ శక్తి మహిళలకు ఒక వరం అని బెల్లంకొండ మండల బీసీ సెల్ అధ్యక్షుడు గుంజ గంగారావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం స్త్రీ శక్తి పథకంలో భాగంగా ఆయన చండ్రాజుపాలెం నుండి పిడుగురాళ్ల బస్సులో ప్రయాణిస్తున్న మహిళలను పలకరిస్తూ ప్రవేశపెట్టిన పథకాల పనితీరుపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు భాగంగా స్త్రీ శక్తి పథకాన్ని ఆగస్టు 15న ప్రారంభించారు. దీనిలో భాగంగా పెదకూరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ ఆదేశాల మేరకు ఈరోజు బస్సులో ప్రయాణిస్తున్న మహిళలకు ఉచిత జీరో షేర్ టికెట్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ ఉచిత బస్సులో ప్రయాణించే మహిళలందరూ తమ వెంట రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఒక గుర్తింపు కార్డు ఆధార్ కార్డు, పాన్ కార్డు, రేషన్ కార్డ్ మరియు ఓటర్ ఐడి కార్డ్ వీటిలో ఏదో ఒక గుర్తింపు కార్డు ఉంటే రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అయినా ఉచితంగా ప్రయాణించవచ్చు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ఆనాడు ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో భాగంగా పెన్షన్ పెంపు, దీపం 2, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఇప్పుడు స్త్రీ శక్తి పథకాలను ప్రభుత్వం అమరావతి రాజధాని అభివృద్ధి చేస్తూ, వరుస వారీగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ అభివృద్ధి, సంక్షేమం రెండు అందించడం ఒక కూటమి ప్రభుత్వానికే చెందుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు ఓర్చు రాంబాబు, తమ్మిశెట్టి వెంకటగిరి, మణికంఠ, నితీష్ జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్ రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.