Janasena News Paper
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

మండల స్థాయి ఆటల పోటీల్లో సత్తా చాటిన విజు డమ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్

బెల్లంకొండ, అక్టోబర్ 10, జనసేన ప్రతినిధి

పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం పాపాయపాలెం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన మండల స్థాయి అండర్ 14, 17 ఆటల పోటీలలో నాగిరెడ్డి పాలెం గ్రామంలో ఉన్న విజుడము ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు ప్రతిభ చూపించారు.ఈ ఎంపికలకు మండలంలోని వివిధ స్కూల్స్ నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. పోటీలలో పాల్గొన్న క్రీడాకారులలో విజిడం ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు అత్యధికంగా ప్రతిభ చూపించారు అండర్ 17 విభాగంలో కోకో 9,కబడ్డీ 9,వాలీబాల్ 6,మంది అండర్ 14 విభాగంలో కబడ్డీ 7, వాలీబాల్ జట్టు కెప్టెన్ రాము నాయక్ ఆధ్వర్యంలో విజేతలుగా నిలవగా 100 మీటర్స్ లో జయపరావ్, లాంగ్ జంప్ లో అనిల్, షార్ట్ పుట్ లో వినయ చందు,లు విజేతలుగా నిలిచి జిల్లా స్థాయి పోటీలకు సెలక్ట్ అయ్యారు వీరిని స్కూల్ ప్రిన్సిపాల్ పాండురంగారెడ్డి,వ్యాయామ ఉపాధ్యాయులు పిటి మాస్టర్ రామాంజనేయులు నాయక్ తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు అభినందించారు.

Related posts

Leave a Comment