Janasena News Paper
అంధ్రప్రదేశ్కాకినాడతాజా వార్తలు

వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి

*వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి* –

*అధికారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా*. కాకినాడ,

జనసేన ప్రతినిధి, మార్చి 23:
వైయస్సార్ సంపూర్ణ పోషణ పథకం ద్వారా అందిస్తున్న పౌష్టికాహారం గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నారులకు పూర్తిస్థాయిలో అందే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్యదర్శి కె.ఎస్.జవహ‌ర్ రెడ్డి..రాష్ట్ర ఉన్నతస్థాయి అధికారులతో కలిసి గురువారం సాయంత్రం అమరావతి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

 

ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా క్యాంపు కార్యాలయం నుంచి హాజరయ్యారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు; వైద్య ఆరోగ్యం, మహిళా శిశు సంక్షేమం; పాఠశాల విద్యా శాఖకు సంబంధించిన డ్రాప్ అవుట్స్, జగనన్న గోరు ముద్ద, మన బడి నాడు-నేడు; గ్రామ/వార్డు సచివాలయాల్లో స్పందన, గడప గడపకు మన ప్రభుత్వం అర్జీల పరిష్కారం, ఇతర ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలపై సీఎస్ జవహర్ రెడ్డి..కలెక్టర్లతో సమీక్షించారు. అనంతరం జిల్లా కలెక్టరు కృతికా శుక్లా..అధికారులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని, ఎస్డీజీ ప్రాధాన్య అంశాలపై వివిధ శాఖల అధికారులు ప్రత్యేకంగా దృష్టిసారించాలన్నారు. ఇందుకు విద్య, వైద్యం, మహిళా అభివృద్ధి శిశు సంక్షేమం తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టరు అధికారులను ఆదేశించారు.

 

వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్వో కె.శ్రీధర్ రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీర‌మ‌ణి, డీఎం అండ్ హెచ్వో డా. ఆర్.రమేష్, డీసీహెచ్ఎస్ డా. పీబీ విష్ణువర్థిని, ఐసీడీఎస్ పీడీ కె.ప్రవీణ, డీఐఓ డా. ఐ.ప్రభాకర్, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు, కాకినాడ, పెద్దాపురం డీఎల్డీవోలు త‌దితరులు హాజ‌ర‌య్యారు.

Related posts

Leave a Comment