భువనగిరి, జనసేన ప్రతినిధి, ఏప్రిల్ 28: భువనగిరి మున్సిపాలిటీ లో అక్రమ వెంచర్ల పై, అక్రమ బ్లాస్టింగ్ లపై చర్యలు తీసుకోవాలని వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మహమ్మద్ అతహర్ భువనగిరి మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి కి వినతి పత్రం అందచేయడం జరిగింది. ఈ సందర్బంగా అతహర్ మాట్లాడుతూ భువనగిరి మున్సిపాలిటీ లోని 1065,981,982,983 సర్వే నెంబర్ తాత నగర్ లోని చర్చ్ వద్ద అలుగు నాలా పక్కన అక్రమ లేఅవుట్లు వేసి ప్లాట్లు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని అదేవిధంగా ఎస్ఎల్ఎన్ఎస్ డిగ్రీ కళాశాల వద్ద సుప్రభాత్ హైట్స్ వెంచర్ లో అక్రమ బ్లాస్టింగ్ ల వలన చుట్టు పక్కల నివసించే వారిపై రాళ్లు వచ్చి పడుతూ వారికి తీవ్ర ఇబ్బంది కలుగుతుందని వారి ఇళ్ళు కూడా పగుళ్ళు వచ్చి తీవ్ర నష్టం కలుగుతుందని తెలిపారు.
ఇదంతా అధికారులకు తెలిసే జరుగుతుందా ఒకవేళ తెల్వకుంటే చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.అదే విధంగా భువనగిరి మున్సిపాలిటీ లోని అన్ని అక్రమ వెంచర్ ల పై, ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. లేని యెడల ప్రజా ప్రయోజనాల కొరకు వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో అక్రమదారుల పై ఉద్యమిస్తామని, ఎంత పెద్ద వారైన వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు.దీనిపై మున్సిపల్ కమిషనర్ సానుకూలంగా స్పందించి అందరి పై చర్యలు తీసుకుంటామని తెలిపారని అతహర్ అన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు షకీల్, పట్టణ అధ్యక్షులు సాయి నివాస్, మైనారిటీ పట్టణ అధ్యక్షులు వాహేద్, యూత్ కార్యదర్శి రాకేష్ తదితరులు పాల్గొన్నారు.