Janasena News Paper
అంధ్రప్రదేశ్అనంతపురంతాజా వార్తలు

బీమాతో మరణం తర్వాత కూడా భరోసా ఇస్తుంది: సర్పంచ్ వన్నూరమ్మ

కనేకల్, జనసేన ప్రతినిధి, ఏప్రిల్ 28: మనిషి బ్రతికుండగానే తన సంపాదనలో కొంత జీవిత బీమా చేసుకోవడం వలన మరణం తర్వాత కూడా వారి కుటుంబానికి భరోసా కల్పిస్తుందని ఎర్రగుంట సర్పంచ్ వన్నూరమ్మ అన్నారు. కనేకల్ మండలం ఎర్రగుంట గ్రామానికి చెందిన జగలూరు మల్లికార్జున రెడ్డి 2021 సంవత్సరంలో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా శ్రీ విద్యా పాలసీ తీసుకున్నారు. ఇటీవల జనవరి 10వ తేదీన అనారోగ్యంతో మల్లికార్జున రెడ్డి మృతి చెందాడు. నామిని అయినా మృతిని భార్య లక్ష్మి కి ఈ రేంజ్ 8 లక్షల.20వేల 160 రూపాయల బీమా చెక్కును శ్రీరామ్ ఇన్సూరెన్స్ ప్రతినిధులు ఆధ్వర్యంలో సర్పంచ్ వన్నూరమ్మ చేతుల మీదుగా చెక్కును అందించారు. కార్యక్రమంలో ఏరియా మేనేజర్ ఖాదర్ భాష . బ్యాంకు మేనేజర్ దేవేంద్ర. నాగరాజు బసవరాజు రఫీ చంద్రశేఖర గౌస్ వలి సాబ్, హనుమంతప్ప వన్నప్ప తదితరులు పాల్గొన్నారు.

Related posts

Leave a Comment