Janasena News Paper
తాజా వార్తలుతెలంగాణమంచిర్యాల

కార్మిక అమరవీరుల త్యాగాలకు మేడే పోస్టర్ల విడుదల

 

టి.ఎన్.టి.యు.సి జనరల్ సెక్రెటరీ టి మణి రామ్ సింగ్

జనసేన ప్రతినిధి, మంచిర్యాల జిల్లా, ఏప్రిల్ 30: బెల్లంపల్లి ఏరియా లోని గోలేటి టౌన్షిప్ లో టి.ఎన్.టి.యు.సి ఆఫీసు నందు కార్మిక అమరవీరుల త్యాగాల స్ఫూర్తితో సంఘీభావ దినం గా 137 వ మేడే దినోత్సవం సందర్భంగా సింగరేణి కాలరీస్ లేవరు యూనియన్ టి.ఎన్. టి యు.సి ఆధ్వర్యంలో గోలేటి టౌన్షిప్ లోని ఆఫీసు నందు టి.ఎన్.టి.యు.సి మేడే పోస్టర్లను విడుదల చేసారు. ఈ సందర్భంగా టిఎన్టియుసి జనరల్ సెక్రెటరీ టి మణి రామ్ సింగ్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు కార్మిక వర్గం అంతా పోరాటాలకు సిద్ధంగా ఉండాలని అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీక రింజా భూమని తెలంగాణ రాష్ట్రం రాకముందు గౌరవ ముఖ్యమంత్రి  ఆర్టీసీ సింగరేణి ప్రైవేటీకరణ నిలిపివేస్తామని అందులో పని చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులను కూడా పెర్మనెంట్ చేసి డిస్మిస్ కార్మికులకు కూడా ఒక అవకాశం ఇస్తామని కొత్త బొగ్గు గనులు తీసుకువచ్చి ఇంటి కుక్క ఉద్యోగం ఇస్తామని ఎన్నో వాగ్దానాలు చేయడం జరిగింది.

ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చాలని కార్మికులంతా ఐక్యమత్యంతో ఉద్యోగ పరిరక్షణ హక్కుల రక్షణకై ఉద్యమించాలని అలాగే వీధి వీ వీధి వీధినా ఎర్రజెండాలు ఎగురవేసి పోరాటాలకు సిద్ధంగా ఉండాలని టిఎన్టిసి కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో టిఎన్టియుసి ప్రధాన కార్యదర్శి టీ మణి రామ్ సింగ్ , బెల్లంపల్లి గ్రూప్ ఆఫ్ మైన్స్ అధ్యక్షులు కొంతం యాదగిరి , గుర్రం గంగయ్య, వైస్ ప్రెసిడెంట్ గద్దెల నారాయణ, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు ఎండి హసన్, తోట రాజయ్య, జి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

Leave a Comment