Janasena News Paper
అంధ్రప్రదేశ్చిత్తూరుతాజా వార్తలు

ఆలేటి వాగులో ఇసుకను తవ్వేస్తున్న భూ బకాసురులు

భారీగా ప్రభుత్వ ఆదాయానికి గండి..
అక్రమ ఇసుక లాభాలతో కోట్లకు పడగలేత్తిన స్మగ్లర్లు..

    అన్నమయ్య జిల్లా, జనసేన ప్రతినిధి, జూన్ 13: అన్నమయ్య జిల్లా  తంబళ్లపల్లె నియోజకవర్గ పరిధిలోని బి. కొత్తకోట నగర పంచాయతీ పరిధిలోని ఆలేటి వాగులో ఇసుకను అక్రమంగా తవ్వేస్తున్న భూ బకాసురులు. చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న మైన్స్ అండ్ జియాలజీ అధికారులు. కోట్ల విలువ చేసే ఇసుక మాయం. ఇష్టారాజ్యంగా ఇసుకను బయట రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్న స్మగ్లర్లు. ఇంత జరుగుతున్న నిద్ర వ్యవస్థలో అధికారులు.

బి. కొత్తకోట పట్టణ సమీపం ఆలేటి వాగులో ఎలాంటి అనుమతులు లేకుండా కోట్ల రూపాయల విలువ చేసే ఇసుకను రాత్రి పగలు అనే తేడా లేకుండా అక్రమంగా అక్రమార్కులు ఇసుక ని తోడేసి సొమ్ము చేసుకుంటున్న మైన్స్ అండ్ జియాలజీ అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడడం లేదు. కొంతమంది రైతులు జగనన్నకు చెబుతాం కార్యక్రమం ద్వారా ఫిర్యాదు చేస్తే మదనపల్లి ఎస్ ఈ బి అధికారులు దాడులు నిర్వహించి నామమాత్రంగా మూడు ట్రాక్టర్లను సీజ్ చేసి బి. కొత్తకోట పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు. అయినా రాత్రిపూట మూడు జెసిబిలు పెట్టి ఇసుకను తోడేస్తున్న ఏ ఒక్క అధికారి ఇటువైపు కన్నెత్తి చూడకపోవడంతో ఇసుక బకాసురులు కోట్ల రూపాయలు విలువచేసి ఇసుకను తోడేసి ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. అంతేకాకుండా పక్కనున్న పట్టాదారుల భూములు ఇసుకను తోడేస్తుండడంతో నిత్యం గొడవలు జరుగుతూనే ఉన్నాయి.

ఇకనైనా అధికారులు దీనిపై చర్యలు తీసుకుని అక్రమంగా ఇసుకను అమ్ముతున్న వారిపై వాల్టా చట్టం కింద కేసు నమోదు చేసి ఇసుక బకాసురులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని రైతులు కోరుతున్నారు..

Related posts

Leave a Comment