- విశ్వకర్మ యోజన సక్రమంగా అమలు చేయాలి: త్రినాథ్
- బీజేపీ ఓబీసీ మోర్చా అధ్వర్యంలో కలెక్టర్ కు వినతి పత్రం అందజేత.
జనసేన ప్రతినిధి, అమలాపురం, ఫిబ్రవరి 5
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఓబిసి మోర్చా అధ్యక్షులు రొంగోల గోపి శ్రీనివాస్ ఆదేశాల మేరకు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఓబిసి మోర్చా అధ్యక్షుడు చెల్లిoగి త్రినాథ్రావు ఆధ్వర్యంలో ఓబిసి మోర్చా సభ్యులు సోమవారం డాక్టర్ జిల్లా కలెక్టర్ వారికి రాష్ట్రంలో ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం సక్రమంగా అమలు కావడం లేదని, నమోదు చేయడానికి కామన్ సర్వీసు సెంటర్ వారు అక్రమ వసూళ్లు చేపడుతున్నారని, అధికారుల పర్యవేక్షణ లేకుండా పోయిందని,పంచాయతి లాగిన్ లలో అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని, అర్హత కు సంబంధించి, వృత్తికి సంబంధించి ఏ విధమైన పత్రాలు అవసరం లేకపోయినా, అవి కావాలి అంటూ లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలియచేయడం జరిగింది.
ప్రధాన మంత్రి విశ్వకర్మయోజన పథకాన్ని సక్రమంగా అమలు చేయవలెనని కలెక్టర్ గారిని కోరడం జరిగింది. వెంటనే స్పందించి, విశ్వ కర్మ యోజన పథకాన్ని సక్రమంగా అమలు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గాడి సత్తిబాబు,జిల్లా ఓబిసి మోర్చా ప్రధాన కార్యదర్శులు శివ,ఓబిసి ప్రదాన కార్యదర్శులు పార్టీ నాయకులు పాల్గొన్నారు.