- అర్జీలకు సకాలంలో పరిష్కారం చూపించాలి – జిల్లా కలెక్టర్ ఎం.గౌతమ
- కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో నిర్వహించిన స్పందన గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టర్.
అనంతపురం, ఫిబ్రవరి 05 :అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో సోమవారం నిర్వహించిన జగనన్నకు చెబుదాం, స్పందన గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి అర్జీలను స్వీకరించారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్, నగర పాలక సంస్థ కమిషనర్ మేఘస్వరూప్, జిల్లా పరిషత్ సీఈవో వైఖోమ్ నిదియా దేవి, డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి, డిప్యూటీ కలెక్టర్లు నీలమయ్య, రవీంద్ర, ఆనంద్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి 364 అర్జీలను జిల్లా కలెక్టర్ స్వీకరించడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలకు సకాలంలో పరిష్కారం చూపించాలని ఆయా శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యానికి తావివ్వరాదని, గడువులోపు అర్జీలను నిత్యం మానిటర్ చేస్తూ పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
మళ్లీ రీఓపెన్ కాకుండా అర్జీలను నాణ్యతగా పరిష్కరించాలని, అర్జీదారున్ని సంప్రదించి అర్జీలకు పరిష్కారం చూపించాలన్నారు. ఆయా శాఖల జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించి అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఓ అశోక్ కుమార్ రెడ్డి, డిఆర్డిఏ పిడి నరసింహారెడ్డి, వెప్మా పీడీ విజయలక్ష్మి, వ్యవసాయ శాఖ జెడి ఉమామహేశ్వరమ్మ, సోషల్ వెల్ఫేర్ జెడి మధుసూదన్ రావు, ఐసిడిఎస్ పిడి శ్రీదేవి, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ నాగరాజారావు, ఎల్డిఎం సత్యరాజ్, డీపీఓ ప్రభాకర్ రావు, డిఎంహెచ్ఓ డా.ఈబి.దేవి, డిసిహెచ్ఎస్ డా. పాల్ రవికుమార్, జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డా.కిరణ్ కుమార్ రెడ్డి,
ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.వెంకటేశ్వరరావు, పశుసంవర్ధక శాఖ జెడి సుబ్రమణ్యం, బీసీ వెల్ఫేర్ డిడి కుష్బూ కొఠారి, డిటిడబ్ల్యువో రామాంజనేయులు, వికలాంగుల సంక్షేమ శాఖ ఏడి రసూల్, హార్టికల్చర్ డిడి రఘునాథ రెడ్డి, ఏపీఎంఐపి పిడి ఫిరోజ్ ఖాన్, బిసి కార్పొరేషన్ ఈడీ సుబ్రహ్మణ్యం, ఏపీఎస్పీడీసీఎల్ ఏడి వివేకానంద స్వామి, ఆర్అండ్బి ఎస్ఈ ఓబుల్ రెడ్డి, డిటిసి వీర్రాజు, డిఎల్డివో ఓబులమ్మ, డిఎస్ఓ శోభారాణి, కలెక్టరేట్ సూపరింటెండెంట్ లు, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.