Janasena News Paper
అంధ్రప్రదేశ్తాజా వార్తలుశ్రీ సత్యసాయి జిల్లా

శ్రీధర్ రెడ్డిని  మరోసారి ఆశీర్వదించండి!

సత్య సాయి జిల్లా సాధకుడు  దుద్దుకుంట శ్రీధర్ రెడ్డిని  మరోసారి ఆశీర్వదించండి!

ప్రచారంలో దూసుకుపోతున్న దుద్దుకుంట కిషన్ రెడ్డి!



అమడగూరు, ఏప్రిల్ 6 ,జనసేన,న్యూస్,  సత్య సాయి జిల్లా సాధకుడు, 193 చెరువుల సాధకుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిధి పుట్టపర్తి శాసనసభ్యులు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డిని మరోసారి ఆశీర్వదించాలని ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి తనయుడు దుద్దుకుంట కిషన్ రెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు. శనివారం మండల పరిధిలోని గుండువారిపల్లి పంచాయతీ పరిధిలోని సోలకుంట్ల, మామిడి మాకలపల్లి,  గుండువారిపల్లి గ్రామాలలో దుద్దుకుంట కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  తొలత కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన నవరత్నాలు,  సంక్షేమ పథకాలపై ఆయా గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి పథకాలపై  ప్రజలకు వివరించారు. 

ఈ సందర్భంగా దుద్దుకుంట కిషన్ రెడ్డి మాట్లాడుతూ పుట్టపర్తి నియోజకవర్గం లో కుల మతాలకు,  పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి పనిచేశారని గుర్తు చేశారు.  పుట్టపర్తి నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ పథకాలు అందజేయడంలో ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గట్టిగా కృషి చేశారన్నారు.  సంక్షేమ పథకంలో కాకుండా నియోజకవర్గంలో ప్రతి మారుమూల గ్రామానికి కోట్లాది రూపాయలు వెచ్చించి సిసి రోడ్ల తో పాటు,  తారు రోడ్లు మంజూరు చేసి పూర్తిచేసిన ఘనత కూడా దుద్దుకుంట శ్రీధర్ రెడ్డికే దక్కుతుందన్నారు.  అలాగే ఇల్లు లేని నిరుపేదల కోసం ఏకంగా నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 26వేల పక్క ఇల్లు మంజూరు చేసి సొంత ఇంటి కల నెరవేర్చిన ఘనత కూడా ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డికే దక్కుతుందన్నారు.  ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు పుట్టపర్తి నియోజకవర్గంలో శ్రీకారం చుట్టి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపింది ఒక్క ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి అని ఆయన తెలిపారు. 

రాబోయే రోజుల్లో పుట్టపర్తి నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి చెందాలంటే మరోసారి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డిని గెలిపించాలని ఆయన ఓటర్లను  అభ్యర్థించారు.  అనంతరం ఇంటింటికి తిరిగి ఫ్యాను గుర్తుకే ఓటు వేయాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఇందుకు ఓటర్లు దుద్దుకుంట కిషన్ రెడ్డిని ఎంతో ఆప్యాయంగా అక్కను చేర్చుకుని కిషన్ రెడ్డికి ఘన స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు.  ఈ కార్యక్రమంలో ఎంపీపీ గజ్జలప్రసాద్ రెడ్డి జడ్పిటిసి శివశంకర్ రెడ్డి, వైయస్ఆర్సీపీ మండల కన్వీనర్ సూర్యనారాయణ రెడ్డి,  మండల సచివాలయ కన్వీనర్ జయప్ప, మండల రైతు సంఘం అధ్యక్షులు  ధర్మారెడ్డి,  మండల బూత్ కమిటీ కన్వీనర్ రంగారెడ్డి,  సర్పంచులు మోహన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, ఆదినారాయణ, షబ్బీర్,  ఎంపీటీసీలు సురేందర్ రెడ్డి, నాగరాజు, శ్రీరాములు,పెద్దపయ్య, కో ఆప్షన్ నెంబర్ కాజా పేరా, వైఎస్ఆర్సిపి నాయకులు గోపి, కొండారెడ్డి, ఫకీర్ రెడ్డి, సోము, ఈశ్వర్ రెడ్డి, శేఖర్ రెడ్డి, బాబు, భాస్కర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు

Related posts

Leave a Comment