Janasena News Paper
తెలంగాణయాదాద్రి భువనగిరి

మంచినీటి సమస్యను
పరిష్కరించాలి.

మంచినీటి సమస్యను
పరిష్కరించాలి. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి సలిగంజి వీరస్వామి.


వలిగొండ ఏప్రిల్ 07(జనసేన )

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గోపరాజు పల్లి గ్రామంలో 300 కుటుంబాల రెండు వాటర్ ప్లాంట్లు ఉండగా తక్కువ సామర్థ్యం గల వాటర్ ప్లాంట్ ను పివి శ్యాంసుందర్రావు ఫౌండేషన్ నుండి పెట్టుకోవడం జరిగింది. గతంలో ఉన్న వాటర్ ప్లాంట్ మాజీ ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి విరాళం నుండి వాటర్ ప్లాంట్ నిర్మించుకోవడం జరిగింది . అట్టి వాటర్ ప్లాంట్ చెడిపోయి శిథిల అవస్థలో మూడు మాసాల నుండి ఉన్నది.  గ్రామ సర్పంచ్ల కాలపరిమితి అయిపోయిన తర్వాత గ్రామపంచాయతీలను పట్టించుకునే నాధుడే కరువయ్యాడు.  వర్షాలు తక్కువ పడడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయి  తాగునీటి సమస్య పెద్ద సమస్యగా ఏర్పడింది అని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి సలిగంజి వీరస్వామి అన్నారు. దాతలు సహకారం లేక  ప్రజలు ఇబ్బందుల పాల్గొనవుతున్నారు. పంచాయతీ కార్యదర్శి మరియు స్పెషల్ ఆఫీసర్లు స్పందించి ప్రతిపాదనలు పంపాలని కోరారు . స్థానిక ఎమ్మెల్యే పూర్తిస్థాయిలో స్పందించి ప్రతిపాదనలు తీసుకొని నూతన వాటర్ ప్లాంట్ నిర్మాణం కోసం సహకరించాలని ఒక ప్రకటనలో కోరారు.

Related posts

Leave a Comment