Janasena News Paper
అంధ్రప్రదేశ్తాజా వార్తలు

మరో రెండు నెలల్లో బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం.

మరో రెండు నెలల్లో బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం.


గన్నవరం, జనసేన ప్రతినిధి, ఏప్రిల్ 7.
మరో రెండు నెలల్లో టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురానున్నట్లు  గన్నవరం నియోజకవర్గ టిడిపి, జనసేన, బిజెపి కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావ్ సతీమణి జ్ఞానేశ్వరి హామీ ఇచ్చారు. స్థానిక శ్రీనగర్ కాలనీలో ఆదివారం సాయంత్రం ఆమె ఎన్నికల ప్రచారం  సందర్భంగా ఇంటింకి తిరుగుతూ చంద్రబాబు నాయుడు ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోను గన్నవరం నియోజకవర్గ అభివృద్ధికి తన భర్త  వెంకట్రావ్ చేపట్టబోయే సూపర్ సిక్స్ పథకాల కరపత్రాలను పంచిపెట్టారు. 

ఈ సందర్భంగా టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టబోయే పలు సంక్షేమ,అభివృద్ధి  పథకాలను ప్రజలకు వివరించారు. రాష్ట్రంలో  బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలపై దాడులు అధికమయ్యాయని  వీటినిరికట్టేందుకు ప్రత్యేక చట్టాన్ని రూపొందిస్తామని ఇప్పటికే చంద్రబాబునాయుడు హామీ ఇచ్చిన సంగతి గుర్తు చేశారు. గన్నవరంలో బహుళజాతి ఐటి కంపెనీలు తీసుకొచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. రానున్న  ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుకు  సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో గన్నవరం టౌన్ అధ్యక్షుడు జాస్థి శ్రీధర్, ఎంపీటీసీలు కొమ్మరాజు సుధీర్, పడమట రంగారావు, మద్దినేని వెంకటేశ్వరావు, పాలడుగు నాని, గూడపాటి తులసీమోహన్, జాస్థి మురళి కృష్ణ, అల్లూరి రాజేష్, మేడసాని రామకృష్ణ, వాటుగూటి మురళి, షేక్ రఫీ, మండవ రమ్యకృష్ణ, మండవ లక్ష్మి, ఆళ్ళ దమయంతి, దేవినేని సులోచన, తదితరులు పాల్గొన్నారు.

Related posts

Leave a Comment