
గోరంట్ల, జనసేన బ్యూరో, ఏప్రిల్ 08:
గోరంట్ల మండల పరిధిలోని వెంకటరమణ పల్లి పంచాయతీ లో పెరమళ్ళపల్లి గ్రామ సమీపంలో రైతు పద్మావతి పొలంలో వేప చెట్టు నరుకుతున్న విషయం తెలుసుకున్న గోరంట్ల మండల రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ రాహుల్ సంఘటన స్థలానికి చేరుకుని ముద్దాయిల తోపాటు నరికిన వేప చెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఎంతటి వారైనా అనుమతి లేకుండా వేపచెట్టులు కానగ చెట్లు కలప నరికితే చట్టపరమైన చర్యలు ఉంటాయని, వారు హెచ్చరించారు. సదరు ముద్దాయిలను సత్యసాయి జిల్లా రేంజ్ దిష్టి ఆఫీసర్ ఎదుట హాజరుపరచి వారిని విచారించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవలసినదిగా సిబ్బందికి ఆదేశించడంజరిగింది. సందర్భంగా, జిల్లా అధికారి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, అక్రమ కలప రవాణా,చెట్ల నరికివేత పై సమాచారాన్ని ప్రజలు అటవీ అధికారులకు తెలియజేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, తెలిపారు. ఈ కార్యక్రమంలో
సబ్ డి ఎఫ్ జి.పి .ఆనంద్ -పెనుగొండ ,ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఈ .జె.శ్రీనివాసులు రెడ్డి బుక్కపట్నం రేంజ్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.