ఎన్నికలకు ముందే చేతులెత్తేసిన చంద్రబాబు
ప్రచార కార్యక్రమంలో టిడిపిపై బిఎస్ మక్బూల్ విమర్శలు.

కదిరి, జనసేన బ్యూరో, ఏప్రిల్ 10: గతంలో అధికారం చేపట్టి అమలు చేయలేని హామీల మేనిఫెస్టోను వెబ్సైట్ నుండి డిలీట్ చేసిన తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ఎన్నికలకు ముందే ఆ పార్టీ నాయకులు మాట తప్పారు. నిన్నటి వరకు సూపర్ సిక్స్ అంటూ అమలు చేయలేని హామీలనిచ్చిన కూటమి సభ్యులు నేడు సూపర్ సిక్స్ ను రద్దు చేస్తూ కొత్త మేనిఫెస్టోను విడుదల చేస్తామంటూ మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి కొత్త ఎత్తుగడలు వేస్తున్నారని కదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బూల్ విమర్శించారు.
బుధవారం తలుపుల మండల పరిధిలోని తురకవాండ్లపల్లి, కొరుగుట్టపల్లి, ఎర్రసానిపల్లి, మాడికివాండ్లపల్లి, బురుజు పల్లి తదితర గ్రామాలలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన గడప గడపకు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బి.ఎస్ మక్బూల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలతో మమేకమైన ఆయన వారితో మాట్లాడుతూ..
రాష్ట్రంలో టిడిపి మనుగుడే కష్టమైన తరుణంలో పార్టీని ఎలా గట్టెక్కించాలో తెలియని చంద్రబాబు దిక్కు తోచని స్థితిలో ఉన్నారని అందులో భాగంగానే అలవి కానీ హామీల మేనిఫెస్టోను చూపించి ఎన్నికలలో లబ్ధి పొందాలని చూస్తున్నారని కూటమి సభ్యులపై ఆయన ధ్వజమెత్తారు.
కావున ఇచ్చిన హామీలలో 99% నెరవేర్చిన సంక్షేమ సారధి జగనన్న గడచిన ఐదేళ్లలో నిరుపేదలకు చేసిన మేలును గుర్తుంచుకొని రెండవసారి ముఖ్యమంత్రిని చేయడానికి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని వారిని అభ్యర్థించారు. అదేవిధంగా రాబోయే ఎన్నికల కోసం ప్రజలకు రెండింతల మేలు చేకూర్చే విధంగా ప్రజా మేనిఫెస్టోను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి త్వరలో విడుదల చేయబోతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా, రాష్ట్ర సీఈసీ సభ్యుల పూల శ్రీనివాసరెడ్డి, సేవాలాల్ జోనల్ ఇన్చార్జ్ డీకే బాబు, ఎంపీపీ రఫీ నాయక్, మండల కన్వీనర్ ఫయాజ్, మాజీ జడ్పిటిసి కులశేఖర్ రెడ్డి, సీనియర్ నాయకులు కులశేఖర్ రెడ్డి, వివేకానంద రెడ్డి, కుర్లి శివారెడ్డి, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.