Janasena News Paper
అంధ్రప్రదేశ్తాజా వార్తలు

ఉపాధి హామీ పథకం కార్మికులు ఏ.ఐ.ఎఫ్.టి.యూలో చేరిక…

కనీస వేతనం 500 రూపాయలు, 250 రోజుల పని దినాలు పెంపుదల చేయాలని డిమాండ్

అమలాపురం, జనసేన ప్రతినిధి, ఏప్రియల్ 10: అమలాపురం జనుపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకం కార్మికులు అఖిల భారత కార్మిక సంఘాల సమైక్య (ఏ.ఐ.ఎఫ్.టి.యు) లో ముత్తా బత్తుల నాగమణి నాయకత్వంలో 30 మంది కార్మికులు చేరారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఏ. ఐ.ఎఫ్.టి.యూ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి రంబాల సతీష్ పాల్గొని మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తుందని అందుకే కేంద్ర బడ్జెట్లో ఉపాధి పథకం నిధులను తగ్గించడం జరిగిందని గుర్తు చేశారు.

ఉపాధి హామీ పథకం కింద కార్మికులను బలోపేతం చేయాలని, కనీస వేతనం 500 రూపాయలు మరియు సంవత్సరానికి 250 రోజులకు పని దినాన్ని పెంచాలని డిమాండ్ చేశారు. జిల్లా ఉపాధ్యక్షులు కుంచె అంజిబాబు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కార్మికులు సంఘాలుగా ఏర్పడి బలోపేతం అవ్వాలని ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సూసుమ,మలవరపు బేబీ, సరోజిని,వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

Leave a Comment