నియామకపు పత్రాలు అందించిన అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి
అనపర్తి జనసేన ప్రతినిధి, మే 02: అనపర్తి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో చదువుతున్న పదిమంది విద్యార్థులు క్యాంపస్ ఇంటర్వ్యూలో భాగంగా వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ వారి ఆధ్వర్యంలో అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి నియామకపు పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపల్ మరియు సిబ్బంది కృషిని అభినందించారు అదేవిధంగా ఉద్యోగాలు సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు.