మదనపల్లిలో తీవ్ర కలకలం రేపిన రైతు హత్య..
పాలు పొసి వస్తుండగా నడి రోడ్డులో కిడ్నాప్..
పొలాల్లోకి ఎట్టుకెళ్లి చిత్రహింసలు పెట్టి దారుణంగా హతమార్చిన దుండగులు..
పెనుగులాటలో పడిపోయిన మృతుడి మొబైల్ ఫోన్, చెప్పులు..
దారిలో లేకుండా బైకు ముళ్ల పొదల్లో దాచిన అగంతకులు..
కాళ్ళు, చేతులు వెనక్కి కట్టేసి, నోట్లో గుడ్డకుక్కి రాళ్లతో తలపై కొట్టి చిత్రహింసలు పెట్టి చంపిన వైనం..
ఘటన స్థలంలో హత్యకు ఉపయోగించిన టేప్ రోల్, మెడకు చుట్టిన టవల్ ..
హత్య వార్త తెలియగానే ఆఘ మేఘాలపై ఘటనస్థలానికి డిఎస్పీ కేశప్ప, సీఐ, ఎస్ఐలు.. టమోటాలు కొనడానికి వచ్చామని మృతుని భార్యతో చెప్పడంతో అనుమానాలు..
అప్రమత్తమైన పోలీసులు బృందాలుగా ఏర్పడి విభిన్న కోణాల్లో లోతుగా దర్యాప్తు..
క్లూస్ టీం, జాగిలాలతో నిందితుల కోసం గాలించిన పోలీసులు..
హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి, మృతుని కుటుంబీ కులను ఆరా తీసిన జిల్లా ఎస్పీ గంగాధరరావు…
అన్నమయ్య జిల్లా, జనసేన ప్రతినిధి, జులై 12: మదనపల్లి ఇన్నాళ్లు స్తబ్దతగా ఉన్న మదనపల్లి బోడిమల్లు దిన్నెలో మంగళవారం రాత్రి జరిగిన రైతు హత్యతో ఉలిక్కి పడింది. మదనపల్లిలో కలకలం రేపిన రైతు హత్య ఉదంతంపై పోలీసులు మృతుని కుటుంబీకుల కథనం ప్రకారం మదనపల్లి మండలం, కొండామరి పల్లి పంచాయతీ, బోడిమల్లు దిన్నెకు చెందిన నారెం సుబ్బ రాఘవరెడ్డి కుమారుడు ఎన్. రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజారెడ్డి(62) వ్యవసాయ పొలంలోనే ఇంటిని నిర్మించుకుని జీవనం సాగిస్తూ భార్య జ్యోతి, పిల్లలు బిందు, కీర్తిలను పోషించు కుంటున్నాడు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం గ్రామానికి వెళ్లి పాలు పొసి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు సుమారు 7.30 గంటల సమయంలో ఇంటికి వచ్చే దారిలో నడి రోడ్డుపై రైతును అడ్డగించి బలవంతంగా కిడ్నాప్ చేశారు.
దుండగులతో పెనుగులాడిన రాజశేఖర్ రెడ్డి మొబైల్ దారిపక్కనే పడిపోయింది. చీకటి కారణంగా మొబైల్ ఫోన్, చెప్పులు వదిలేసి కిడ్నాప్ చేసుకుని సమీపంలోని బీడు పొలాల్లోకి ఎట్టుకెళ్లారు. ఎవ్వరికీ అనుమానం రాకుండా ముందుగా రైతు బైకును ముళ్ల పొదల్లో దాచేశారు. రైతును పొలాల్లోకి ఎట్టుకెళ్లిన దుండగులు కాళ్ళు, చేతులు వెనక్కి కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి రాళ్లతో తలపై కొట్టి చిత్ర హింసలు పెట్టి చంపే శారు. ఘటన స్థలంలో రైతు దుండగులతో పెనుగులాడిన ఆనవాళ్లు స్పంష్టంగా వున్నాయి. సుమారు గంటకు పైగా రైతు శత్రువులతో పోరాడినట్లు ఉంది. చివరకు వారి చేతుల్లో దారుణంగా హత్యకు గురైయ్యడు. హత్యకు ఉపయోగించిన టేప్ రోల్ మృతుడి మెడకు చుట్టిన టవల్ అలాగే వదిలేసి నిందితులు సాఫీగా వెళ్లి పోయరు.