సుప్రీంకోర్టు న్యాయవాది, ఐ ఎల్ ఏ జాతీయ అధ్యక్షులు చింతల శ్రీకాంత్
కాకినాడ , ఫిబ్రవరి 8 : రాజ్యాంగ అమలులో పాలకుల నిర్లక్ష్య వైఖరి కారణంగా రాజ్యాంగ పరిరక్షణలో న్యాయవాదులు నడుం బిగించాలని సుప్రీంకోర్టు న్యాయవాది ఐ ఎల్ ఏ జాతీయ అధ్యక్షులు చింతల శ్రీకాంత్ పిలుపునిచ్చారు. ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ జిల్లా సమావేశం కాకినాడ కోర్టుల ప్రాంగణంలో శనివారం జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సుప్రీంకోర్టు న్యాయవాది శ్రీకాంత్ హాజరై మాట్లాడుతూ రాజ్యాంగ స్ఫూర్తిని సమాజానికి అందించడంలో పాలకులు విఫలమయ్యారన్నారు. ఐ ఎల్ ఏ రాష్ట్ర అధ్యక్షులు జి శాంత కుమార్ మాట్లాడుతూ న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలు సామాజిక సమస్యల పరిష్కారం దిశగా ఐఎల్ఏ కృషి చేస్తుందన్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్స్లర్ డాక్టర్ బాబ్జి మాట్లాడుతూ సామాన్యులకు మెరుగైన న్యాయం అందించేందుకు న్యాయవాదులు కృషి చేయాలన్నారు సభకు అధ్యక్షత వహించిన న్యాయవాది టీ పృథ్వీరాజ్ మాట్లాడుతూ న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం సంక్షేమం కోసం ఐఎల్య కృషి చేస్తుందన్నారు. బార అసోసియేషన్ అధ్యక్షులు ముత్తింటి విశ్వేశ్వరరావు మాట్లాడుతూ ప్రజలలో చట్టాల పట్ల అవగాహన కల్పించాలన్నారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు జవహర్ అలీ పిల్లి శ్రీనివాస్ జయలక్ష్మి పితాని శ్రీనివాస్ సయ్యద్ సాలార్ ప్రసన్నకుమార్ జేవి రమణ సునీత తదితరులు పాల్గొన్నారు.
ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా టీ పృధ్వీరాజ్
ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఐఎల్ఏ జిల్లా సమావేశంలో జిల్లా నూతన కమిటీని రాష్ట్ర అధ్యక్షులు జి శాంత కుమార్ నియమించారు. ఐ ఎల్ ఏ ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా టీ పృథ్వీరాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా పితాని వెంకటేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులుగా కోలా శ్రీహరిరావు, కార్యదర్శిగా వందే విజయ రాజ్ కుమార్, కోశాధికారిగా జేవీ రమణ లతో కార్యవర్గాన్ని నియమించారు.