అకాల వర్షాల వలన నష్టపోయిన రైతులను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలి
కొత్తపేట తెలుగుదేశం పార్టీ డిమాండ్
జనసేన ప్రతినిధి, అంబేద్కర్ కోనసీమ, కొత్తపేట, మే 2 : అకాల వర్షాల వలన రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కల్లాలలో ఉండగా పండించిన పంట ధాన్యం తడిసిపోయింది. ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని రైతు పక్షాన కొత్తపేట తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షులు బండారు సత్యానందరావు పిలుపుమేరకు కొత్తపేట మండలం ఆవిడి గ్రామంలో ఇబ్బందులు పడుతున్న రైతుల వద్దకు రాష్ట్ర రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ తెలుగుదేశం పార్టీ నాయకులతో వెళ్లి పరామర్శించారు. పంట ధాన్యాన్ని పరిశీలించారు.
రైతు ప్రభుత్వం అని పదే పదే చెబుతారు. రైతులు గోడు ప్రభుత్వానికి పట్టడం లేదని తెలుగుదేశం పార్టీ నాయకులు వద్ద రైతులు ఆవేదన చెందారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో రైతులకు టార్పాలిన్స్ బరకాలు ఇచ్చేవారు. అవి ఇలాంటప్పుడు ఎంతో ఉపయోగపడేవి. కానీ ఈ ప్రభుత్వంలో బరకాలు కాదు కదా రైతులకు ఏ విధమైన సహాయ సాకారాలు అందించడం లేదని వారు వాపోయారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ రైతు పడుతున్న అవస్థలను దగ్గరగా వెళ్లి చూసిన తర్వాత చాలా బాధ కలిగిందని అన్నారు. పొలాలలో పండించిన పంట అలాగే ఉంది. దాన్యం కల్లాలలోనే ఉండిపోయింది ఏవో కుంటి చాకులతో ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదు. అకాల వర్షాల వలన రైతులు చాలా నష్టపోయారు. రైతు యొక్క దీనావస్థను గుర్తించి ప్రభుత్వం తక్షణమే రైతులను ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.
కొత్తపేట నియోజకవర్గ రైతు అధ్యక్షులు జక్కంపూడి వెంకటస్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కంఠంశెట్టి శ్రీను, ముత్యాల బాబ్జి, ధర్నాల రామకృష్ణ ,బండారు సత్తిబాబు, రెడ్డి రామకృష్ణ,గుబ్బల మూర్తి, బూసి భాస్కరరావు చోడపనిడి భాస్కరరావు, రెడ్డి రామారావు,రెడ్డి శ్రీనివాస్, సురవరపు రామకృష్ణ, రెడ్డి తాతాజీ, అద్దంకి చంటిబాబు, బొక్క వెంకట కుమార్, వాసంశెట్టి సత్యనారాయణ,కాశీ దన రాజు, ఫాలంగి శీను, బయ్యే రాంబాబు, తోరం బోసు, చిల్లి ప్రసాదు,చిల్లి కుమార్ తదితరులు పాల్గొన్నారు.