Janasena News Paper
అంధ్రప్రదేశ్తాజా వార్తలుప్రకాశం

సర్పంచి వసంతమ్మ ను సన్మానించిన “జనసేన వార్తా పత్రిక” ప్రతినిధులు

    అర్థవీడు, జనసేన బ్యూరో (ఏప్రిల్ 28): ప్రకాశం జిల్లా అర్థవీడు మండలం అర్థవీడు గ్రామ పంచాయతీ సర్పంచి మునగాల వసంతమ్మ ను సోమవారం ‘జనసేన వార్తా పత్రిక’ ప్రకాశం జిల్లా బ్యూరో కట్టా రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. అర్థవీడు గ్రామ సర్పంచ్ మునగాల వసంతమ్మ కు గ్రామ పంచాయతీ అభివృద్ధి విషయంలో అంకితభావం ప్రదర్శిస్తూ గ్రామ పంచాయతీ అభివృద్ధికి చేసిన కృషిని అభినందిస్తూ సర్పంచుల సంఘం అధ్యక్షుడు వీరభద్రాచారి, ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ చేతుల మీదుగా ప్రశంసాపత్రంతో ఉత్తమ సేవా పురస్కారం లభించిన విషయం విధితమే.

సర్పంచి వసంతమ్మ అర్థవీడు గ్రామ పంచాయతీకి చేసిన కృషికి పురస్కారం లభించిన విషయాన్ని గ్రహించిన ‘జనసేన వార్తా పత్రిక’ ప్రకాశం జిల్లా బ్యూరో కట్టా రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా మార్కాపురం డివిజన్ ఇంచార్జి వేశపోగు రమేష్, గిద్దలూరు ఆర్.సి ఇంచార్జి షేక్ అహమ్మద్ బాషా సర్పంచి వసంతమ్మ ను శాలువాతో సన్మానించగా, ప్రకాశం జిల్లా బ్యూరో కట్టా రమేష్ మెమొంటో ను అందజేశారు. అనంతరం వసంతమ్మ మాట్లాడుతూ ఉత్తమ సేవా పురస్కారం లభించడం చాలా సంతోషంగా ఉందని, దానికంటే కూడా ప్రజలకు సేవ చేయడంలోనే తనకు మిక్కిలి సంతోషం, ఆనందం అని అన్నారు.

Related posts

Leave a Comment