గిద్దలూరు జనసేన ప్రతినిధి (ఏప్రిల్ 30):ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కొంగలవీడు గ్రామ పంచాయతీ సర్పంచి వందన బోయిన లక్ష్మీ ప్రసన్నకు ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న సందర్బంగా బుధవారం కొంగలవీడు సర్పంచి లక్ష్మీ ప్రసన్న, భూపాల్ యాదవ్ దంపతులను వారి స్వగృహం నందు “జనసేన వార్తాపత్రిక” ప్రతినిధులు ప్రకాశం జిల్లా బ్యూరో ఇంచార్జి కట్టా రమేష్ ఆధ్వర్యంలో మార్కాపురం డివిజన్ ఇంచార్జి వేశపోగు రమేష్, గిద్దలూరు నియోజకవర్గ ఇంచార్జి షేక్ అహమ్మద్ బాషా మరియు గిద్దలూరు రిపోర్టర్ షేక్ మహమ్మద్ ఖాశిం మెమోంటో అందజేసి శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ ఉత్తమ సేవా పురస్కారం లభించడం చాలా సంతోషంగా ఉందని ప్రజలకు సేవ చేయడం మిక్కిలి సంతోషంగా ఉందని తెలిపారు.