Janasena News Paper
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపశ్చిమ గోదావరి

భారతదేశ సంప్రదాయ కళలకు ఆస్ట్రేలియాలో విశేష ఆదరణ: చెరుకువాడ రంగసాయి

భీమవరం జనసేన ప్రతినిధి మే 2: కళలకు ప్రాంతీయ బేధం లేదని, విదేశాల్లో ఉన్న చెరుకువాడ రంగసాయి మనవరాలు కుమారి సుప్రజ పట్టుదలతో భారత నృత్యం చేయడం మన ప్రాంతానికే గర్వకారణమని పట్టణ ప్రముఖులు కనుమూరి సత్యనారాయణరాజు, చెరుకువాడ వెంకట్రామయ్య అన్నారు. భీమవరం పట్టణ సంఘ సేవకులు చెరుకువాడ రంగసాయి ఇటీవల ఆస్ట్రేలియా సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియాలోని సంప్రదాయలపై మాట్లాడుతూ ఆస్ట్రేలియాలో తన మనవరాలు సుప్రజ భరతనాట్య అరంగేట్రం తిలకించిన అక్కడ విదేశీయులు కూడా మన కళల పట్ల చూపిన ఆదరణ మర్చిపోలేనని, భారతీయ సంప్రదాయ శాస్త్రీయ కళలు ఆస్ట్రేలియాలో విశేషంగా అదరించబడుతున్నాయని, సంగీత, నృత్య, చిత్రకళ వేద పాఠశాలలు నిర్వహిస్తున్నారని అన్నారు.

తన మనవరాలు సుప్రజ ఆస్ట్రేలియాలో నృత్య ప్రదర్శనను విదేశీయులు వీక్షించారని, భారతీయులు, తెలుగు వారితో పాటు అక్కడ విదేశీయులు సంప్రదాయ దుస్తులతో ఈ కార్యక్రమానికి విచ్చేశారని, అసంతం కూడా తిలకించారని తెలిపారు. కార్యక్రమంలో న్యాయవాది ఉండపల్లి రమేష్ నాయుడు, అరసవల్లి సుబ్రహ్మణ్యం, భట్టిప్రోలు శ్రీనివాసరావు, చుక్కనశ్రీ తదితరులు సుప్రజ ను అభినందించారు.

Related posts

Leave a Comment