వరద బాధితులకు దుస్తులూ పంపిణీ చేస్తాం: సీఎం చంద్రబాబు
.
AP: విజయవాడ వరద బాధితులకు నిత్యావసరాలతోపాటు దుస్తులు కూడా ఇస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆప్కో, ఇతర సంస్థల నుంచి వస్త్రాలను కొనుగోలు చేసి పంపిణీ చేస్తామన్నారు. వరదల్లో సర్వం కోల్పోయిన వారికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బుడమేరు నుంచి కొల్లేరుకు నీళ్లు వెళ్లకుండా కబ్జాలు చేయడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని, గత పాలకుల పాపాలు ఇప్పుడు శాపాలుగా మారాయని విమర్శించారు.