- ఆలయ పరిధిలో పోలీసు సిబ్బంది నియమించండి
- ఆలయ కమిటీ చైర్మన్ రమానంద
లేపాక్షి జనసేన ప్రతినిధి ఫిబ్రవరి 5: మండల కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ వీరభద్ర స్వామి ఆలయానికి దేశ నలుమూలల నుంచి ఆలయ సందర్శన కోసం ఎక్కువ మంది భక్తులు వస్తున్నారని ,ఈ క్రమంలో ఆలయ భద్రత మరియు క్షేత్రానికి వచ్చే భక్తులు మరియు పర్యాటకులకు సరియైనటువంటి పోలీసు భద్రతా సిబ్బంది లేకుండా ఉండడం వల్ల బక్తా దులు అనేకమైన ఇబ్బందులకు గురికావలసి వస్తుంది. నంది విగ్రహము దగ్గర పోలీస్ అవుట్ చెక్ పోస్ట్ ఉన్నప్పటికీ ఇప్పటికీ సిబ్బంది నియమించలేదని, ప్రతి శుక్రవారం శనివారం ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని దేవాలయ ఆవరణములో పార్కింగ్ స్థలంలో దొంగలు సంచరిస్తున్నట్లుగా సమాచారం వస్తున్న నేపథ్యంలో సరైన భద్రత కల్పించాలని ఆలయ కమిటీ చైర్మన్ కరణం రమానంద స్వామి,డి.ఎస్.పి కన్జక్షన్ భాషకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. సానికూలంగా స్పందించిన డి.ఎస్.పి వారం రోజులలోపు సిబ్బందిని నియమిస్తామని ,హామీ ఇవ్వడం జరిగిందని చైర్మన్ రమానంద స్వామి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వీరభద్ర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ కరణం బ్రహ్మానంద స్వామి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.