Janasena News Paper
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

నాగార్జున యాదవ్ దుష్ప్రచారాలుమానుకోవాలి

ఎంపీ గురించి మాట్లాడే స్థాయి నీది కాదు గుర్తుపెట్టుకో

బెల్లంకొండ మీడియా సమావేశంలో మండల బీసీ సెల్ అధ్యక్షుడు గుంజా గంగారావు

బెల్లంకొండ, సెప్టెంబర్ 22, జనసేన ప్రతినిధి

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న గుంజా గంగారావు

పల్నాడు ప్రాంతంలోని పిడుగురాళ్ల మెడికల్ కాలేజీని విజ్ఞాన్ సంస్థలకు కూటమి ప్రభుత్వం కట్టబెట్టాలని చూస్తుందని వైసీపీ నాయకుడు నాగార్జున యాదవ్ దుష్ప్రచారం చేయడం మంచి పద్ధతి కాదని బెల్లంకొండ మండల బీసీ సెల్ అధ్యక్షుడు గుంజ గంగారావు అన్నారు. శనివారం బెల్లంకొండ లో అయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలోనే ఉత్తమ పార్లమెంట్ సభ్యునిగా కేంద్ర ప్రభుత్వం నుంచి ర్యాంక్ సాధించిన నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు. శ్రీకృష్ణదేవరాయలు పై వైసీపీ నాయకులు కల్పించుకొని లేనిపోని నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని పిడుగురాళ్ల మెడికల్ కాలేజీని విజ్ఞాన్ సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని నాగార్జున యాదవ్ చేసిన ఆరోపణలో ఏ మాత్రం నిజం లేదని, పేదల సంక్షేమం ముఖ్యంగా విద్య సంక్షేమం కోసం పాటుపడే నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు. శ్రీకృష్ణదేవరాయలు పై తప్పుడు ఆరోపణలు మానుకోవాలని ఆయన హితోవ పలికారు. మెడికల్ కాలేజీల విషయంలో పి. పి.పి టెండర్ కు ఆయా రంగాలలో అనుభవం తప్పనిసరి అని విజ్ఞాన్ గ్రూప్ సంస్థకు ఆ రంగాలలో అనుభవం లేనందున పిపిపి టెండర్ లో విజ్ఞాన్ కు అర్హత లేదన్న విషయం నాగార్జున యాదవ్ కు తెలీదా అని అయన ప్రశ్నించారు. మీడియా ముందుకు వచ్చి జగన్ దృష్టిలో పడి నాగార్జున యాదవ్ క్రేజ్ పెంచుకోవాలని అనవసరంగా ఎంపీ పై విజ్ఞాన్ సంస్థల పై దుష్ప్రచారం చేస్తున్నారని ఇలాంటి దుష్ప్రచారాలు మానుకుంటే మంచిది అని ఈ సందర్బంగా ఆయన తెలిపారు.

Related posts

Leave a Comment