Janasena News Paper
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

హెచ్ఐవి,సుఖ వ్యాధులు నివారణ చికిత్సలపై సైకిల్ ర్యాలీ

బెల్లంకొండ, సెప్టెంబర్ 22, జనసేన ప్రతినిధి

బెల్లంకొండ గ్రామం నందుగల జిల్లా పరిషత్ హై స్కూల్ వారి సహకారంతో హెచ్ఐవి మరియు సుఖ వ్యాధులు నివారణ,చికిత్సల పై సైకిల్ ర్యాలీ మరియు అవగాహన కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమం ఇంటెన్సిఫైడ్ ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ క్యాంపెయిన్ , ఎయిడ్స్ నివారణ అవగాహన కార్యక్రమములో భాగంగా
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశముల మేరకు చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్ స్కీం వారి ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించి, ఎయిడ్స్ మరియు సుఖ వ్యాధులపై అవగాహన నిర్వహించడం జరిగింది . ప్రతి వారం థీమ్ (8 వారాలు అనగా 2 నెలలు)లలో భాగంగా మొదటివారం సుఖ వ్యాధులు నివారణ చికిత్స పై అవగాహన కలిగించడం జరిగినది.
ఈ కార్యక్రమం జోనల్ సూపర్వైజర్ విశ్వేశ్వరరావు మాట్లాడుతూ చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్ స్కీము ఉమ్మడి గుంటూరు జిల్లాలో 100 గ్రామాల్లో పనిచేస్తున్నామని, ఈ ఇంటెన్సిఫైడ్ ఐ ఇ సి క్యాంపెయిన్ ద్వారా పల్నాడు జిల్లాలోని 60 గ్రామాలలో 8 వారాలపాటు హెచ్ఐవి, టి.బి మరియు సుఖ వ్యాధులపై అవగాహన కార్యక్రమాలు, ఐఇసి మెటీరియల్స్ మరియు ఫ్రీ కండోమ్ డిస్ట్రిబ్యూషన్ మరియు రక్త పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఎయిడ్స్ అంటే ఏమిటీ అవి ఎన్ని మార్గాలు ద్వారా వస్తుంది అని వివరించడం జరిగింది. రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత చిన్న చూపు లేకుండా ఎలాగా సమాజములో కలసి జీవించాలి, ఎయిడ్స్, క్షయ వ్యాధి సంబందం గూర్చి, సుఖ వ్యాధులు మరియు చికిత్స గూర్చి, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ ఏక్ట్ 2017, ఏ. ఆర్. టి మందులు, టోల్ ఫ్రీ నెంబర్ 1097 గూర్చి, గ్రామంలో సైకిల్ ర్యాలీ చేస్తూ అవగాహన చేయడం జరిగింది. ఈ సైకిల్ ర్యాలీ కార్యక్రమునకు, స్కూల్ హెడ్ మాస్టర్ శాంతి, స్కూల్ సిబ్బంది, లింక్ వర్కర్లు దీనకుమారి, స్కూల్ విద్యార్థులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Related posts

Leave a Comment