బెల్లంకొండ, సెప్టెంబర్ 22, జనసేన ప్రతినిధి
బెల్లంకొండ మండలం చండ్రాజుపాలెం గ్రామంలో శనివారం రైతులకు ఎరువులను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఏవో అరుణకుమారి మండల బీసీ సెల్ అధ్యక్షులు గుంజా గంగారావు పార్లమెంట్ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి ఓర్చు ఆనంద్ ప్రారంభించారు.ఈ సందర్భంగా గంగారావు మాట్లాడుతూ పెదకూరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ ఆదేశాల మేరకు రైతులకు దూరాభారం తగ్గించడానికి స్థానికంగా ఎరువుల పంపిణీ ప్రారంభించామన్నారు ప్రతిపక్ష పార్టీ చేస్తున్న అబద్ధపు మాటలు విని రైతులు ఆందోళన చెందారని కొంతమంది రైతులు యూరియా ని అందరూ ఎక్కువగా తీసుకొని నిలువ ఉంచుకోవడం వలన యూరియా కొరత వచ్చిందని ఆయన అన్నారు మండలానికి అవసరం కన్నా ఎక్కువ యూరియానే వచ్చింది అని ఆయన అన్నారు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక రైతులను ప్రజలను తప్పుదోవ పట్టించాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయని ఆయన ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు ఓర్చు రాంబాబు, లక్ష్మయ్య తమ్మిశెట్టి వెంకటగిరి మణికంఠ, ఏసు పాదం, నితీష్, తదితరులు పాల్గొని యురియా పంపిణీ చేశారు.

