బెల్లంకొండ,అక్టోబర్ 02, జనసేన ప్రతినిధి

విజయదశమి పర్వదినం సందర్భంగా నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలకు పెదకూరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ కు బెల్లంకొండ మండల తెలుగుదేశం మరియు జనసేన భాజాపా పార్టీ కుటుంబ సభ్యులకు మండల బీసీ సెల్ అధ్యక్షుడు గుంజా గంగారావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మీడియాతో మాట్లాడిన ఆయన.. “దసరా పండుగ చెడుపై మంచి సాధించిన విజయాన్ని గుర్తు చేస్తుంది. ఈ పండుగ దుర్గాదేవి ఆశీస్సులతో ప్రతి ఇంట్లో ఆనందం, శాంతి, ఐశ్వర్యం నింపాలని కోరుకుంటున్నాను. ప్రజల జీవితాల్లో కొత్త విజయాలు, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తున్నాను” అని అన్నారు. అలాగే దసరా ప్రత్యేకతను వివరించిన ఆయన “ఈ పండుగలో భాగంగా జరిగే అలయ్-బలయ్, పాలపిట్ట దర్శనం, జమ్మి ఆకు (బంగారం) పంచుకోవడం వంటి సంప్రదాయాలు మన సంస్కృతి గొప్పతనాన్ని గుర్తు చేస్తాయి” అని తెలిపారు.

