మండల బీసీ సెల్ అధ్యక్షుడు గుంజి గంగా రావు
బెల్లంకొండ, ఏప్రిల్ 11,జనసేన ప్రతినిధి
మహాత్మా జ్యోతి బా పూలే 199 వ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం బెల్లంకొండ మండల బీసీ సెల్ అధ్యక్షుడు గుంజ గంగా రావు పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజానికి పూలే అందించిన సేవలు ఎనలేనివని మహారాష్ట్రలో జన్మించిన కుల వ్యతిరేక కార్యకర్త, రచయిత, ఆలోచనా పరుడు సామాజిక సంస్కర్త జ్యోతిబా పూలే అని పేర్కొన్నారు. అదే విధంగా భారతదేశంలో సామాజిక మార్పును పెంపొందించడంలో ఆయన చేసిన కృషి ఎనలేనిదని పేర్కొన్నారు. ఆయన జయంతి రోజైన నేడు దేశ పౌరులు బహుముఖ ప్రజ్ఞాశాలైన సామాజిక సంస్కర్త గురించి ప్రతి ఒక్కరూ తెల్సుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. జ్యోతిబా పూలే భార్య సావిత్రిబాయి ఫూలే భారతదేశంలో మహిళల విద్య కోసం విశేష కృషి చేశారని చెప్పారు. ఫూలే సమాజానికి చేసిన సేవలను గుర్తుంచుకుని సామాజిక సంస్కర్తగా ఆయన కాలంలో ఎదుర్కొన్న ఇబ్బందులు చేసిన త్యాగాలను కూడా మనం పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడి సామాజిక చైతన్యం కలిగించిన పూలే బడుగు జీవుల ఆశాజ్యోతి అని పూలేకి ఆనాటి సమాజంలో ఎన్నో ఇబ్బందులు ఎదురైనప్పటికీ మొక్కవోని దీక్షతో శ్రామిక జీవుల పక్షాన నిలబడే ధైర్యశాలి అని సమాజంలో సామాన్యులకు విద్య చేరువైంది అంటే ఆనాడు పూలే కృషి అన్నారు. సత్యశోధక సమాజం ద్వారా సమాజంలో చాలా మార్పు తీసుకురావడానికి కృషి చేశారు. ముఖ్యంగా బాలికల విద్య కోసం గట్టిగా కృషి చేశారు. 1873లో కుల వ్యవస్థ వల్ల కలిగే సామాజిక ఆర్థిక అసమానతలను తిప్పికొట్టడానికి సత్యశోధక్ సమాజ్ (“సత్యశోధక్ సమాజ్”) అనే సంస్కరణ సంఘాన్ని పూలే స్థాపించారని గంగా రావు ఈసందర్భంగా గుర్తు చేశారు. ఫూలే బాల్య వివాహాలను వ్యతిరేకించడం తోపాటు వితంతు పునర్వివాహం చేసుకునే హక్కును సమర్థించారని ఆయన గుర్తు చేశారు.
