BSNL స్థిరంగా తన కస్టమర్ సేవలను మెరుగుపరుచుకుంటూ వెళ్తుంది. కొన్ని నెలల ముందు BSNL ప్రవేశపెట్టిన కొత్త రీచార్జ్ ప్లాన్స్ అందుబాటు ధరలో ఉండటం వలన కొన్ని లక్షల మంది సబ్స్క్రైబర్లు BSNL లోకి మారారు .
గత ఆరు నెలలుగా BSNL వార్తల్లో నిలుస్తూనే ఉంది . ముఖ్యంగా తన ప్రత్యర్ధులు అయిన ఎయిర్టెల్, జియో వారి రీచార్జ్ ప్లాన్స్ ప్రియం చేసినప్పటినుండి BSNL కు కస్టమర్ బేస్ పెరుగుతూ వచ్చింది. యూనియన్ మినిస్టర్ రాజ్యసభ లో BSNL గురించి మాట్లాడుతూ గత ఆరు నెలల్లో BSNL, 55 లక్షల కొత్త వినియోగదారులు వచ్చారని వివరించారు.
భారత ప్రభుత్వం BSNL ఆదాయం మరియు కస్టమర్ల బేస్ పెంచడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు . జూన్ 2024 లో ఎనిమిది కోట్ల యాభై లక్షలు గా ఉన్న BSNL వినియోగదారుల సంఖ్య ఫిబ్రవరి 2025 నాటికి తొమ్మిది కోట్ల పది లక్షల కు చేరిందని తెలిపారు.
BSNL ( కస్టమర్ సర్వీస్ మంత్ )
వినియోగదారుల బంధాలు మరియు సేవలు మెరుగుపరుచుకు BSNL కస్టమర్ సర్వీస్ మంత్ ప్రోగ్రామ్ ను మొదలు పెట్టింది. ఈప్రోగ్రామ్ అమలు పరచడానికి ఏప్రిల్ నెలను ఎంచుకుంది . ఈ ప్రోగ్రామ్ లో BSNL తన వినియోగదారుల నుండి అభిప్రాయాలను సేకరించి తన సేవలు మెరుగుపరచడానికి ఉపయోగిస్తుంది. ఈ ప్రోగ్రామ్ ను భారత దేశమంతా వివిధ భాగాల్లో చురుకుగా అమలు చేస్తూ వారి అభిప్రాయాల ద్వారా వినియోగదారులకు ఇంకా మెరుగైన సర్వీసులు అందించాలని భావిస్తుంది.
BSNL 5జీ ప్రణాళిక
BSNL తన నెట్వర్కింగ్ సేవలను మెరుగుపరచడానికి చురుకుగా నిర్ణయాలు తీసుకుంటుంది. జూన్ 2025 కి లక్షా నాలుగు వేల కొత్త 4జీ టవర్లను ఏర్పాటు చేయాలనీ ప్రణాలిక చేసింది. అయితే ఇప్పటికే ఎనభై వేల కొత్త 4జీ టవర్లను ఏర్పాటు చేసింది . తన ప్రణాళికలో భాగంగా ఈ 4జి టవర్లలో 5జీ గా మార్చదగిన ఇండిజెనీయస్ టెక్నాలజీని పొందుపరిచింది . BSNL 5జీ సేవలు త్వరలోనే ప్రారంభించాలనే ఆలోచనలో ఉందని ఈ టవర్ల ఏర్పాటు స్పష్టం చేస్తున్నాయి .