గన్నవరం తహసిల్దార్ గా ఎం. సీతా పవన్ కుమార్.
గన్నవరం, జనసేన ప్రతినిధి, ఫిబ్రవరి 5: గన్నవరం నూతన తహసిల్దార్ గా ఎం సీతా పవన్ కుమార్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో వీరు తూర్పుగోదావరి జిల్లా రాజానగరం తహసిల్దార్ గా పనిచేశారు. సాధారణ ఎన్నికల బదిలీల్లో భాగంగా గన్నవరానికి బదిలీ అయ్యారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన తహసిల్దార్ కు కార్యాలయ సిబ్బంది సాదర స్వాగతం పలికి అభినందనలు తెలిపారు.