Janasena News Paper
అంధ్రప్రదేశ్గుంటూరుతాజా వార్తలు

హెల్ప్ ఫౌండేషన్ (సత్తనపల్లి)వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు పరిక్షా సామాగ్రి పంపిణీ….

గుంటూరు పట్టణ శివారు నందివెలుగు రోడ్డు నందు గల ఆంధ్రప్రదేశ్ ఉర్దూ బాలుర రెసిడెన్షియల్ గురుకుల   పాఠశాల లొ  హెల్ప్ ఫౌండేషన్ (సత్తనపల్లి) ఆధ్వర్యంలో *పదవ తరగతి విద్యార్థులకు గుంటూరు పట్టడానికి చెందిన నవీన్ టైలర్ ప్రోప్రైటర్ నజీర్  సహకారంతో పరీక్ష సామాగ్రి పంపిణి.కార్యక్రమానికి ముందుగా ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహారదీక్ష చేపట్టిన పొట్టి శ్రీరాములు జయంతి వారోత్సవాలలో భాగంగా ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించడం జరిగింది.ఈ కార్యక్రమానికి   ముఖ్యఅతిథిగా  సీడ్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు  కోమరే బేగం ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మైనార్టీల సంక్షేమం కోసం ఎన్నో వినూత్నమైనటువంటి పథకాలను కార్యక్రమాలను ప్రవేశపెట్టి వారి అభివృద్ధి కోసం పాటుపడుతుందని అలాగే ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఉన్నతమైన స్థితికి చేరాలి అంటే చదువు ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని ఆత్మ విశ్వాసమే కొండంత బలం క్రమశిక్షణతో కూడిన ప్రయత్నం మంచి విజయాలను అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రిన్సిపల్ జయప్రకాష్ అధ్యక్షత వహించి మాట్లాడుతూ   ప్రతి వ్యక్తి జీవితంలో  విద్య చాలా ప్రాముఖ్యమైనదని మనిషి స్థితిగతులను మార్చేది విద్య మాత్రమేనని అన్నారు.హెల్ప్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కంచర్ల బుల్లిబాబు మాట్లాడుతూ సమాజంలో గుర్తింపుని విలువను గౌరవాన్ని పెంచేది.చదువు మాత్రమేనని అన్నారు. .ఈ కార్యక్రమంలో నజీర్ గారి కుమారుడు మహమ్మద్ గౌస్  ఉపాధ్యాయులు రిబ్బాని,సిరాజ్, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు…

Related posts

Leave a Comment