గుంటూరు,ఏప్రిల్23,జనసేన ప్రతినిధి….
జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిపై గుంటూరు నగర జనసేన పార్టీ కార్యదర్శి బొడ్డుపల్లి రాధాకృష్ణ విచారం వ్యక్తం ఈ దాడిని చూసి మాటలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉగ్రవాద చర్యలు సమాజం పై మాయని మచ్చ అని గుంటూరు నగర జనసేన పార్టీ కార్యదర్శి బొడ్డుపల్లి రాధాకృష్ణ తెలియజేశారు. ఉగ్రవాదం హింస ద్వారా లక్ష్యాలేమి సాధించలేరని చరిత్ర చెబుతుందని పేర్కొన్నారు.
పల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఈ దారుణమైన చర్యకు బాధ్యులైన వారిపై కఠినంగా వ్యవహరించాలని ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వానికి ఏపీలోని కూటమి ప్రభుత్వం మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన తెలుగువారు చంద్రమౌళి, మధుసూదన్ కు గుంటూరు నగర జనసేన పార్టీ కార్యదర్శి బొడ్డుపల్లి రాధాకృష్ణ సంతాపం ప్రకటించారు.
