బెల్లంకొండ డిసెంబర్ 28, జనసేన ప్రతినిధి

గుంటూరు మిర్చి యార్డ్ చైర్మన్ గా నూతనంగా ఎన్నికైన కుర్రా అప్పారావు ని పెదకూరపాడు నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు గుంజ గంగారావు ఆయన నివాసంలో ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం తో ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గంగారావు మాట్లాడుతూ ఆసియా ఖండంలోనే మిర్చి ఎగుమతులు దిగుమతులలో అగ్రస్థానంలో ఉన్నటువంటి మార్కెట్ యార్డుకు అప్పారావు చైర్మన్గా ఎన్నికవ్వటం చాలా ఆనందించగద విషయం . తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడిన వారికి ఎప్పుడు గుర్తినిపిస్తుంది అనడానికి ఇది ఒక నిదర్శనం. మీరు ఇటువంటి ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలిపారు.

