
జనసేన ప్రతినిధి బెల్లంపల్లి మే 2: బెల్లంపల్లి నియోజకవర్గం లో ఈనెల 8వ తేదీన బెల్లంపల్లి పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలకు తెలంగాణ రాష్ట్ర మంత్రి బీ.ఆర్.ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు వారి పర్యటనలో భాగంగా పోలీస్ ఉన్నత అధికారులతో కలసి బహిరంగసభ జరిగే స్థలాన్ని పరిశీలించారు బెల్లంపల్లి శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీ.సి.పి సుధీర్ రాంనాథ్ కేకన్ , బెల్లంపల్లి ఎ.సి.పి సదయ్య , బెల్లంపల్లి పోలీస్ డివిజన్ సీ.ఐ లు, ఎస్సై లు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

