హైదరాబాద్, జనసేన ప్రతినిధి, ఏప్రిల్ 11: తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ ను బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కర్ణాటక ఎన్నికల్లో కుమారస్వామికి కేసీఆర్ వందల కోట్లు ఇస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్రమ సొమ్ముతో దేశరాజకీయాలను శాసించాలని కేసీఆర్ చూస్తున్నారని చెప్పారు. జేడీఎస్ ద్వారా తన అస్థిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. వేలకోట్లు సమకూర్చుతా అని కేసీఆర్ బేరసారాలు మొదలుపెట్టారని ఆరోపించారు. భూములను వనరులుగా పెట్టుకుని డబ్బులు సంపాదిస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. తనతో ఉన్న వాళ్లుకు భూములు పంచుతున్నారని అన్నారు. హైటెక్ సిటీ వద్ద 15 ఎకరాల భూమిని తన అనుచరుడికి 60 ఏళ్లు పాటు లీజుకు రాసిచ్చినట్టు ఆరోపించారు.
next post
- Comments
- Facebook comments