ప్రజా సేవకై…ఒక్క అవకాశం ఇవ్వండి
ఎన్నికల ప్రచారంలో జైభీమ్ రావ్ భారత్ పార్టీ(జేబీపీ) సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి, న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్.
పల్నాడు జిల్లా, జనసేన న్యూస్:
సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలకు సుపరిచితుడైన నేను ప్రజా సేవకై మీ ముందుకొచ్చానని ఒక అవకాశం ఇవ్వాలని జైభీమ్ రావ్ భారత్ పార్టీ(జేబీపీ)సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్ అభ్యర్దించారు. ఆదివారం రాత్రి సత్తెనపల్లి మండలం కంకణాలపల్లి గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. స్థానికుడు.. యువకుడు…విద్యావంతుడైన నేను , ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటానని ఒక్క ఫోన్ చేస్తే పది నిమిషాల్లో మీ ముందుటాని చెప్పారు.1952 లో సత్తెనపల్లి నియోజకవర్గం ఏర్పడిన దగ్గర నుంచి పాలించిన పాలకులు వారి పార్టీ అజెండాలు మోశారే గాని ఒక్క పార్టీ కూడా ప్రజల అజెండా మోయలేదన్నారు. మేము రాజ్యాంగం స్ఫూర్తితో ప్రజల మేనిఫెస్టోను ఏర్పాటు చేసి ప్రజల అజెండాతో ముందుకు వెళుతున్నామని ఆయన వివరించారు. ఆత్మగౌరవానికి అహంకారానికి జరుగుతున్న ఎన్నికలని ఆత్మగౌరవం కోసం మన ఓటు మన పాలన కొనసాగించుకుందని పిలుపునిచ్చారు.

యువతతో వాలిబాల్ ఆడిన ఎమ్మెల్యే అభ్యర్థి జొన్నలగడ్డ

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కంకణాలపల్లి ఎస్సీ కాలనీలో జొన్నలగడ్డ విజయ్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో స్థానిక యువత వాలీబాల్ ఆడుతుండటంతో ఆయన కూడా వారితో కలిసి కొద్ది సేపు వాలీబాల్ ఆడారు. చదువుకునే రోజుల్లో పాఠశాల స్థాయి నుంచే క్రీడల్లో బాగా రాణించేవాడినని చెప్పారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొన్నామని , మీరు కూడా చదువుతోపాటు క్రీడల్లో కూడా బాగా రాణించాలని యువతకు ఆయన సూచించారు. ఆయన వెంట దాసరి వెంకటేశ్వర్లు, కందూరి లాజర్, దుగ్గి విజయ్ కుమార్, బొక్క భాస్కర్ రావు, ఆనంద్ వెంకటేశ్వర్లు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.