Janasena News Paper
అంధ్రప్రదేశ్తాజా వార్తలుశ్రీ సత్యసాయి జిల్లా

వైసీపీ పార్టీ నాయకుల ఆరాచకాలు రోజు రోజుకు మితి మీరిపోతున్నాయి

వైసీపీ పార్టీ నాయకుల ఆరాచకాలు రోజు రోజుకు మితి మీరిపోతున్నాయి .

దాడిచేసిన వారిని వెంటనే శిక్షించాలి.
-కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ

పెనుకొండ, జనసేన బ్యూరో, ఏప్రిల్ 10:
మండల పరిధిలోని   గౌనివారిపల్లి  గ్రామంలో  ఉగాది పర్వదినం సందర్భంగా,  ఉత్సవాలు జరుగుతుండగా గ్రామస్తులు గొడవ పడుతుండడంతో గొడవ వద్దు అని సర్ది చెప్పు బోతున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్త లక్ష్మీనరసప్ప రాఘవేంద్ర ,భాష తదితరులు  చెబుతుండగా వైసిపి నాయకులు కావాలనే కుట్రపూరితో రాత్రి తెదేపా సానుభూతిపరుడైన లక్ష్మీ నరసప్ప ఇంటికి 9 గంటలకు  వెళ్లి ,వైసిపి నాయకులు కార్యకర్తలు కలిసి లక్ష్మీ నరసప్ప ఇంటికి వెళ్లి కులం పేరుతో దూషించి దాడిచేయగా తలకు తీవ్రమైన గాయం తగిలింది. వెంటనే గోరంట్ల ప్రభుత్వం ఆస్పత్రిలో చికిత్స పొందారు.

అనంతరం  మెరుగైన వైద్యం కోసం హిందూపురం ప్రభుత్వం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.  ఈ విషయం తెలుసుకున్న  పెనుకొండ నియోజకవర్గ అభ్యర్థి  సవితమ్మ  హాస్పిటల్ కి వెళ్లి  లక్ష్మీనరసప్పను పరామర్శించి దైర్యంగా ఉండు పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించిన పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి  సవితమ్మ  ఈ సందర్భంగా సవితమ్మ  మాట్లాడుతూ,    ఓటమి భయంతోనే వైసీపీ నాయకులు ఆగడాలు
రోజు రోజుకి మితి మీరిపోతున్నాయని వెంటనే స్థానిక పోలీసులు చర్యలు తీసుకొని దాడి చేసిన వారిని శిక్షించి చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన సవితమ్మ ఈకార్యక్రమంలో లీగల్ సెల్ శివ శంకర్ ,గోరంట్ల మండల తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు….

Related posts

Leave a Comment