Janasena News Paper
కాకినాడతాజా వార్తలునేరాలు

మహిళ ప్రాణాలను కాపాడిన ఉప్పాడ కొత్తపల్లి పోలీసులు

మహిళ ప్రాణాలను కాపాడిన ఉప్పాడ కొత్తపల్లి పోలీసులు

కాకినాడ, క్రైమ్, జనసేన ప్రతినిధి, డిసెంబర్ 1:
మహిళ ప్రాణాలు కాపాడిన ఉప్పాడ కొత్తపల్లి ఎస్సై, సిబ్బందిని అభినందించిన ఎస్పీ ఎస్. సతీష్ కుమార్,

శుక్రవారం మధ్యాహ్నం సుమారు గం. 1:15 ని.కు ఉప్పాడ కొత్తపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో సుమారు 45 సంవత్సరాల వయసుగల ఒక మహిళ కుతుకుడిమిల్లి గ్రామంలో నూతిలోనికి దూకి ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటుందని డైల్ 112 కాల్ ద్వారా ఉ.కొత్తపల్లి పోలీస్ స్టీషన్ కు సమాచారం రాగా, వెంటనే ఉ.కొత్తపల్లి ఎస్‌.ఐ పి. వి. సి స్వామి నాయుడు తన సిబ్బందిని వెంటబెట్టుకుని సంఘటన స్థలానికి వెళ్లినారు.

క్షణికావేశంలో కాకాడ వెంకట లక్ష్మి అనే మహిళ మరొక వ్యక్తితో గొడవపడి నూతిలో దూకి ప్రాణాపాయ స్థితిలో చేరింది.

వెంటనే ఉ.కొత్తపల్లి ఎస్‌.ఐ సిబ్బంది స్థానికులు సహాయంతో నూతిలోనికి దూకిన మహిళను నిచ్చెన సహాయంతో పైకి లాగి ప్రాణాలు కాపాడినారు.

ఎస్సై ఆమెకు ప్రధమ చికిత్సను అందించి, ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి ఆమెకు ఏ సహకారం కావాలన్నా పోలీస్ వారు చేస్తారని భరోసా కల్పించి నారు.

ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంటున్నదని తెలిసిన వెంటనే స్పందించి, ఆమె ప్రాణాలు కాపాడిన యు. కొత్తపల్లి ఎస్సై పి. వి. సి స్వామి నాయుడును పిఠాపురం సిఐ , కాకినాడ డిఎస్పి , మరియు కాకినాడ జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్, అభినందించారు.

Related posts

Leave a Comment